చికిత్స పొందుతూ ఖైదీ మృతి
కాకినాడ క్రైం: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే, గుంటూరు సమీపంలో అంకిరెడ్డిపాలేనికి చెందిన మెట్టు భాస్కర్‌రెడ్డి(53).. 30 ఏళ్ల క్రితం బాబాయి, కొడుకు హత్యలకు గురైన కేసులో నిందితుడిగా ఉన్నాడు. పాతికేళ్ల పాటు బెయిల్‌పై ఉండి, ఐదేళ్ల నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్ట్ 31న అనారోగ్యానికి గురయ్యాడు. రాజమహేంద్రవరం వైద్యుల సిఫార్సు మేరకు మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో ఆరోగ్యం విషమించి బుధవారం మధ్యాహ్నం మరణించాడు. దీనిపై కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
జాతీయ బ్యాడ్మింటన్‌లో
హరికృష్ణ, చరణ్‌రామ్‌కు కాంస్యం
సామర్లకోట: జాతీయ స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ అండర్–19 బాలుర డబుల్స్ విభాగంలో సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన వీరంరెడ్డి హరికృష్ణ, చిత్తూరు జిల్లాకు చెందిన తిప్పన చరణ్‌రామ్ జంట తృతీయ స్థానం సాధించారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు అరుణాచల్‌ప్రదేశ్ ఇటానగర్‌లో జరిగిన యోనెక్స్–సన్‌రైజ్ 48వ జూనియర్ నేషనల్ చాంపియన్ షిప్ పోటీల్లో తెలుగు రాష్ట్రానికి చెందిన క్రీడాకారుల జంట ప్రతిభ చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో హరికృష్ణ–చరణ్‌రామ్ కాంస్య పతకాన్ని పొందారు.
చికిత్స పొందుతూ ఖైదీ మృతి


