జుడో పోటీల్లో పతకాల పంట
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జుడో అసోసియేషన్, ఏపీ జుడో అసోసియేషన్, శాప్(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) సంయుక్త సహకారంతో ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించిన అంతర్ జిల్లా సీనియర్ జుడో చాంపియన్ షిప్ పోటీల్లో కాకినాడ జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారని డీఎస్‌డీఓ వి.సతీష్‌కుమార్ బుధవారం తెలిపారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రీడా ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో వివిధ వెయిట్ కేటగిరీల్లో మొత్తం 14 మెడల్స్, ఇందులో ఏడు స్వర్ణ, నాలుగు రజత, మూడు కాంస్య పతకాలు సాధించినట్టు చెప్పారు. పురుషుల విభాగంలో టీం చాంపియన్ షిప్ ప్రథమ స్థానం, మహిళా విభాగంలో టీం చాంపియన్ షిప్ ద్వితీయ స్థానం కాకినాడ జిల్లాకు దక్కిందని వివరించారు. మొత్తం ఏడు స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు మణిపూర్ రాష్ట్రంలోని ఇంపాల్‌లో వచ్చే నెల 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి సీనియర్ జుడో చాంపియన్ షిప్‌లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. పతకాలు సాధించిన క్రీడాకారులను, డీఎస్‌ఏ జుడో కోచ్ పి.వెంకటతేజను డీఎస్‌డీఓ అభినందించారు.
రాష్ట్ర స్థాయిలో 14 మెడల్స్ కై వసం


