27న నిధి ఆప్‌కే నికట్
రాజమహేంద్రవరం రూరల్: నిధి ఆప్‌కే నికట్ కార్యక్రమం రాజమహేంద్రవరం ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయ పరిధిలో గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి జరుగుతుందని ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్–2 వెంకటేశ్వర్లు కలువాయి ఓ ప్రకటనలో తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరంలో ఎం/ఎస్ లూఫియన్ ఫార్మాలో, తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రైట్ ఇంజినీరింగ్ కాలేజీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎస్.యానాంలోని ఎం/ఎస్ వేదాంత లిమిటెడ్, ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం కడగట్ట ఏపీనిట్ పక్కన శశి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ కాలేజీ, పశ్చి మ గోదావరి జిల్లాలో భీమవరం యనమదుర్రు ఎం/ఎస్ సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. మోసాల నివారణ, విజిలెన్స్ అవగాహన, పాస్‌బుక్ తనిఖీ, సభ్యులకు సేవలు, యూఏఎన్ ఖాతాల డీఫ్రీజింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. పీఎఫ్ సభ్యులు, పింఛనుదారులు, ఎస్టాబ్లిష్‌మెంట్లు, కొత్తగా కవర్ చేసిన ఎస్టాబ్లిష్‌మెంట్లు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిధి ఆప్‌కే నికట్ అని పేర్కొంటూ ఫిర్యాదులను సమర్పించవచ్చన్నారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను ఇక్కడ సమర్పించవచ్చని తెలిపారు.
శ్రీప్రకాష్‌లో
క్యాంపస్ ఇంటర్వ్యూలు
తుని: పట్టణంలోని శ్రీప్రకాష్ విద్యాసంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాలలో బుధవారం హెటిరో డ్రగ్స్ ఫార్మా కంపెనీ క్యాంపస్ ఇంట ర్వ్యూలు నిర్వహించింది. కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలకు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు చెందిన వివిధ కళాశాలల ఫైనలియర్ బీఎస్సీ, ఎమ్మెస్సీ కెమెరిస్టీ, బీఫార్మసీ, ఎం.ఫార్మిసీ విద్యార్థులు వంద మందికి పైగా హాజరయ్యారు. కంపెనీ హెచ్‌ఆర్ హెడ్ జి.రాజు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆన్‌లైన్‌లో ఎంపిక పరీక్ష నిర్వహించారు. కంపెనీలో క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అస్స్యూరెన్స్, ప్రొడక్షన్ తదితర విభా గాల్లో పని చేసేందుకు అర్హత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎంపికైన వారిని విద్యాసంస్థల అధినేత సీహెచ్‌వీకే నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయప్రకాష్ అభినందించారు. హెచ్‌ఆర్ సీహెచ్ మణికంఠ, వైస్ ప్రిన్సిపాల్ పెను గొండ సుబ్బారావు, ఐక్యూఐసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ అరుణ్‌కుమార్ త్రిపాఠి పాల్గొన్నారు.


