తైక్వాండో పోటీల్లో ఉమ్మడి జిల్లాకు పతకాలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో ఈ నెల 23, 24, 25వ తేదీల్లో జరిగిన 41వ సీనియర్ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రీడాకారులు ఐదు పతకాలు (4 కాంస్య, ఒకటి రజత) సాధించినట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తైక్వాండో సంఘ కార్యదర్శి బి.అర్జునరావు బుధవారం తెలిపారు. వీరిలో పి.హరికిరణ్ రజత పతకం సాధించగా, వై.గంగాభవాని, జి.వంశీ, ఎల్ వెంకన్నదొర, ఎం హర్షవర్ధన్ కాంస్య పతకాలు సాధించినట్టు వివరించారు. ఈ టోర్నమెంట్‌కు కోచ్‌గా పి.భార్గవి, మేనేజర్‌గా ఆర్ మణికంఠ వ్యవహరించారన్నారు. సీనియర్ ఏపీ టీం జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను, కోచ్‌ను డీఎస్‌డీఓ సతీష్‌కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి.వీరభద్రారెడ్డి, కార్యదర్శి జి.ఎలీషాబాబు, తైక్వాండో సంఘ అధ్యక్షుడు ఎ.మధుసూదన్‌రావు, కోచ్‌లు డీఎన్ సత్యనారాయణ, ఎన్ తులసి, కేవీ సత్యనారాయణ, ఎంపీ త్రిమూర్తులు, ఎన్ రత్న తదితరులు అభినందించారు.


