వారాహి అమ్మవారికి ఆభరణాల సమర్పణ
పెదపూడి: జి.మామిడాడలో ప్రసిద్ధి చెందిన వారాహి మాత అమ్మవారికి పలువురు భక్తులు, దాతలు మంగళవారం వివిధ ఆభరణాలు సమర్పించారు. ద్వారంపూడి సూర్యనారాయణరెడ్డి రూ.25 వేల విలువైను వెండి రుద్రాక్ష మాల, మేడపాటి శ్రీకాంత్‌రెడ్డి అమ్మవారి ఉత్సవమూర్తికి రూ.20 వేల విలువైన వెండి కిరీటం, నల్లమిల్లి గణేష్‌రెడ్డి రూ.75 వేలు విలువైన హస్తాలు, చైతన్య బ్యాంకర్స్ సౌజన్యంతో అమ్మవారి ముఖ అలంకారాలు, వానపల్లి వెంకట గణేష్ బంగారం, వెండితో తయారు చేయించిన మంగళ సూత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ, భక్తులకు ప్రతి రోజూ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకూ వారాహి అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆలయంలో వసతి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్తి భగవాన్‌రెడ్డి, కార్యదర్శి మండ రాజారెడ్డి, కోశాధికారి డీఆర్‌కే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ యోగా
పోటీలకు భవానీచౌదరి
దేవరపల్లి: మండలంలోని చిన్నాయగూడేనికి చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి ఇమ్మణ్ణి అర్మిత భవానీ చౌదరి జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపికైంది. ప్రకాశం జిల్లా జి.పంగులూరు మండలం చందలూరులో ఈ నెల 24న జరిగిన రాష్ట్రస్థాయి అండర్–17 ట్రెడిషనల్ యోగా బాలికల విభాగంలో అర్మితా భవానీచౌదరి ప్రథమస్థానం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2023–24లో యోగా ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమస్థానం, 2023లో అసోంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ద్వితీయస్థానం, ఉత్తర ప్రదేశ్‌లోని హజియాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి 2023 డిసెంబరులో జరిగిన యూవైఎస్‌ఎఫ్ ప్రపంచ యోగా పోటీల్లో ద్వితీయ స్థానం సాధించినట్టు ఆమె తెలిపారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో 2024లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపినట్టు ఆమె చెప్పారు. 2025 జనవరిలో సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా చాంపియన్ పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొని ప్రతిభ చూపి ఐదో స్థానం సాధించినట్టు ఆమె చెప్పారు. ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని స్వర్ణపతకం సాధించడమే తన లక్ష్యమని ఆమె చెప్పారు.
వారాహి అమ్మవారికి ఆభరణాల సమర్పణ


