మరో ఏడాది కొనసాగేందుకు ఈఓ ప్రయత్నాలు
కొత్త ఈఓగా ఎవరిని నియమించాలనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. తనను మరో ఏడాది కొనసాగించాలంటూ ఈఓ సుబ్బారావు పలువురు ప్రజాప్రతినిధుల సిఫారసులతో ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఒక ప్రజాప్రతినిధి ఇప్పటికే లేఖ ఇచ్చారని అంటున్నారు. అయితే, మిగిలిన ప్రజాప్రతినిధులు దీనిపై అంత ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. దేవస్థానంలో గత ఏడాది కాలంగా సుమారు 30 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇవన్నీ ప్రజాప్రతినిధుల సిఫారసులతోనే జరిగాయి. త్వరలో దేవస్థానంలో ఆరు అర్చక, రెండు ఘనపాఠి పోస్టులతో పాటు, ఒక పారాయణదారు పోస్టు భర్తీ చేయాల్సి ఉంది. అలాగే, ఖాళీగా ఉన్న 20 వ్రత పురోహిత పోస్టుల భర్తీ కూడా జరగాల్సి ఉంది.


