నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జుడో సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడామైదానంలో రెండు రోజులుగా జరిగిన జుడో సీనియర్స్ చాంపియన్ షిప్ పోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ పోటీలలో ఓవరాల్ చాంపియన్ షిప్‌ను కాకినాడ జిల్లా జుట్ట కై వసం చేసుకోగా, రెండో స్థానంలో తూర్పుగోదావరి జట్టు, ఉమెన్ క్యాటగిరిలో రెండో స్థానం కాకినాడ జిల్లా జట్టు అందుకున్నాయి. పోటీలలో విజేతలకు జుడో సంఘ రాష్ట్ర సీఈఓ వెంకట్, కాకినాడ చైర్మన్ వెలగ వెంకట కృష్ణారావు, కాకినాడ జిల్లా ట్రజరర్ రమణ, డీఎస్‌ఏ కోచ్ తేజ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, వివిధ జిల్లాల కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు.


