రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో మొదటి స్థానం
కొత్తపల్లి: రాష్ట్ర స్ధాయి రగ్భీపోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాలికల జట్టు మొదటి స్థానం సాధించినట్లు సోమవారం జిల్లా రగ్బీ కోచ్ లక్ష్మణరావు తెలిపారు. రెండు రోజులుగా కర్నూలులో జరుగుతున్న 69వ రాష్ట్ర స్థాయి పాఠశాల రగ్బీ బాలికల పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల రగ్బీ బాలికల జట్టు ప్రథమ స్ధానం సాధించిందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్ –19 స్కూల్ గేమ్ కార్యదర్శి వెంకటరెడ్డి, ఉమ్మడి తూర్పుగోదావరి రగ్బీ అధ్యక్షుడు పి.దొరబాబు, చైర్మన్ వియ్యపు రామన్నరాజు అభినందించారు. జిల్లా జట్టు కోచ్ మేనేజర్‌గా పీడీలు శేషకుమారీ, కె.నాగలింగేశ్వరావు, భార్గవ్ వ్యవహరించారు.


