ఆ రోజు ఏం జరిగింది? | - | Sakshi
Sakshi News home page

ఆ రోజు ఏం జరిగింది?

Nov 25 2025 10:20 AM | Updated on Nov 25 2025 10:20 AM

ఆ రోజ

ఆ రోజు ఏం జరిగింది?

కాకినాడ క్రైం: పడని ఇంజెక్షన్‌ చేసి తాళ్లరేవు మండలం గండేపల్లి పంచాయతీ చినవలసల గ్రామానికి చెందిన నిండు గర్భిణి పెసింగి మల్లీశ్వరి(31) మృతికి కారకులైన కాకినాడ జీజీహెచ్‌ వైద్యులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ సౌరభ్‌గౌర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్‌ రఘునందన్‌ గంభీర సోమవారం కాకినాడ జీజీహెచ్‌లో విచారణ నిర్వహించారు. ఘటన జరిగిన గైనకాలజీ విభాగంలోని యాంటీ నాటల్‌, జీఐసీయూలలో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది నుంచి నర్సులు, వైద్యుల వరకు ప్రతి ఒక్కరి వివరణ తీసుకొని నాలుగు గంటల పాటు సుదీర్ఘ విచారణ చేపట్టారు. బాధిత కుటుంబీకుల నుంచి కూడా వివరణ తీసుకున్నారు. ఘటన జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షి అయిన మృతురాలి వదిన ఽసంగాడి ధనలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటు మృతురాలి సోదరి నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదు డీఎంఈ స్వీకరించారు. మల్లీశ్వరి మృతిపై విచారం వ్యక్తం చేసిన డీఎంఈ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. విచారణ అనంతరం పలువురు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్యకుమారి తీరుపై డీఎంఈకి ఫిర్యాదు చేశారు. వార్డుల్లో సిబ్బంది డబ్బు గుంజుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు రోగుల పట్ల అనుచితంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని డీఎంఈ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం డీఎంఈ డాక్టర్‌ రఘునందన్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి కారకులపై చర్యలకు సిఫారసు చేస్తానన్నారు. నేటి వరకు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని అన్నారు. ఆరుగురు సభ్యుల బృందం ఈ విచారణ చేపట్టింది. డీఎంఈతో పాటు ఇన్‌చార్జి డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ బండారు సుబ్రహ్మణ్యేశ్వరి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ నరసింహ నాయక్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ లావణ్యకుమారి, డిప్యూటీ సూపరింటెండెంట్‌ శ్రీనివాసన్‌, గైనకాలజీ హెచ్‌వోడీ అనురాగమయి విచారణ కమిటీలో ఉన్నారు.

ఒకటి కాదు రెండు నిండు ప్రాణాలు...

కాకినాడ జీజీహెచ్‌ వైద్యుల నిర్లక్ష్యం వల్ల రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. మల్లీశ్వరితో పాటు మరికొద్ది రోజుల్లో జన్మించేందుకు సిద్ధంగా ఉన్న శిశువు బాహ్య ప్రపంచాన్ని చూడకుండానే కన్నుమూసిందని కన్నీటి పర్యంతమయ్యారు. నిండు చూలాలిని కాకినాడ జీజీహెచ్‌లో చేర్చి అన్యాయమైపోయామని కుటుంబీకులు రోదించారు. ఐదేళ్ల బాలిక తల్లిలేని బిడ్డగా మిగిలిపోయిందని వాపోయారు. మృతురాలి కుటుంబీకులు సోమవారం కాకినాడ జీజీహెచ్‌కు వచ్చి మాతాశిశు విభాగం ఆవరణలో బైఠాయించారు. న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. నిర్లక్ష్యంతో కొందరు వైద్యులే చేజేతులా ఆమెను పొట్టబెట్టుకున్నారని ఆరోపించారు. పాంటాప్రొజోల్‌ ఇంజెక్షన్‌ పడదని ఎంత చెబుతున్నా పీజీ వైద్యురాలు డాక్టర్‌ నేనా నువ్వా, నువ్వు నాకు చెప్పేది ఏంటి, నువ్వు ఇక్కడి నుంచి బయటకి పో అంటూ తనపై మండిపడిందని బాధితురాలి వదిన ధనలక్ష్మి వాపోయింది.

నిండు గర్భిణి మృతిపై డీఎంఈ విచారణ

జీజీహెచ్‌లో బైఠాయించి కుటుంబీకుల ఆందోళన

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ప్రాఽథమిక నిర్ధారణ

ఇంకా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదన్న డీఎంఈ

కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ

ఆ రోజు ఏం జరిగింది?1
1/1

ఆ రోజు ఏం జరిగింది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement