ఫ ‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీకి విశేష స్పందన
ఫ ట్రిప్స్ స్కూల్‌లో ఉత్సాహంగా నిర్వహణ
ఫ స్పెల్‌బీ క్వార్టర్, మ్యాథ్‌బీ సెమీ ఫైనల్స్ పరీక్ష
ఫ ఉమ్మడి తూర్పు గోదావరి
జిల్లావ్యాప్తంగా విద్యార్థుల హాజరు
రాజమహేంద్రవరం రూరల్: విద్యార్థులను ఆంగ్ల భాషలో ప్రావీణ్యులుగా, గణితంలో ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆదివా రం నిర్వహించిన స్పెల్‌బీ క్వార్టర్ ఫైనల్స్, మ్యాథ్‌బీ సెమీ ఫైనల్స్‌కు విశేష స్పందన లభించింది. రాజమహేంద్రవరం త్రిపుర నగర్‌లోని ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిర్వహించిన ఈ పరీక్షలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఈ పరీక్షలు రాయించేందుకు అమితాసక్తి చూపారు. ‘సాక్షి’ స్పెల్‌బీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 4 కేటగిరీలుగా నిర్వహించగా, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకూ ‘సాక్షి’ మ్యాథ్‌బీ 4 కేటగిరీల్లో జరిపారు. 1,180 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. కేటగిరీ–1లో 1, 2 తరగతుల విద్యార్థులకు, కేటగిరీ–2లో 3, 4 తరగతులకు, కేటగిరీ–3లో 5, 6, 7 తరగతులకు, కేటగిరీ–4లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. ‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్‌బీ వంటి పరీక్షలు విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని, వారిలోని ప్రతిభను గుర్తించడానికి, కాంపిటేటివ్ పరీక్షలకు ఎంతో దోహదపడతాయని తల్లిదండ్రులు అన్నారు. స్పెల్‌బీ, మ్యాథ్‌బీ నిర్వహించిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరీక్షలను ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ బాలాత్రిపురసుందరి, ‘సాక్షి’ రీజనల్ మేనేజర్ రమేష్‌రెడ్డి’ పర్యవేక్షించారు. ప్రజెంటింగ్ స్పాన్సర్‌గా డ్యూక్స్‌వేఫీస్, అసోసియేట్ స్పాన్సర్‌గా రాజమహేంద్రవరం ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరించాయి.
ఆంగ్లం, గణితంపై పట్టు సాధించవచ్చు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాధాన్యం పెరిగింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచి ఆంగ్లంపై పట్టు సాధించేందుకు స్పెల్‌బీ పరీక్ష దోహదపడుతుంది. ‘సాక్షి’ మ్యాథ్‌బీ పరీక్ష ద్వారా గణితంలో రీజనింగ్, లాజికల్ ఽథింకింగ్‌తో పాటు పోటీతత్వం పెంపొందించడంలో దోహదం చేస్తుంది. గణితంపై విద్యార్థుల్లో ఆసక్తి పెరిగి ప్రజ్ఞావంతులుగా తయారవుతారు. స్పెల్‌బీ, మ్యాథ్‌బీ పరీక్షలు ‘సాక్షి’ నిర్వహించడం అభినందనీయం. – రూపాదేవి గూడూరు, డైరెక్టర్,
ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమహేంద్రవరం
కాన్ఫిడెన్స్ పెరుగుతోంది
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ‘సాక్షి’ స్పెల్‌బీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్త పదాలు నేర్చుకోవడంతో పాటు కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించవచ్చు. నైపుణ్యాలు పెంచుకునేందుకు ఇలాంటి పరీక్షలు ఉపయోగపడతాయి.
– ధన్యట్రెఫోసా, 8వ తరగతి, ట్రిప్స్ స్కూల్, రాజమహేంద్రవరం
భయాన్ని దూరం చేసేందుకు..
‘సాక్షి’ స్పెల్‌బీలో గత ఏడాది ఫైనల్స్‌కు వెళ్లాను. అలాగే ‘సాక్షి’ మ్యాథ్‌బీ అంటే ఎంతో ఆసక్తి. గణితంపై భయాన్ని దూరం చేసే విధంగా మ్యాథ్స్‌బీ పరీక్ష ఒక ప్రాక్టీస్‌లా ఉపయోగపడుతుంది. మా నైపుణ్యాలు పెరుగుతాయి. థ్యాంక్యూ ‘సాక్షి’.
– ఆశ్రిత ఎండూరి, 8వ తరగతి, కోనసీమ విద్యాశ్రమ్, ముక్తేశ్వరం
అకడమిక్‌గా ఉపయోగం
‘సాక్షి’ స్పెల్‌బీ కాంపిటేషన్ పరంగానే కాక అకడమిక్‌గా కూడా చాలా ఉపయోగపడుతోంది. కాంపిటేషన్ కోసం వందల్లో పదాలు నేర్చుకునే అవకాశం కలిగింది. తద్వారా అకడమిక్‌గా కూడా అన్ని విధాలా సహకారి అయ్యింది.
– మేడపాటి శ్రీలక్ష్మీ సాత్విక, 10వ తరగతి,
లాహోరల్ స్కూల్, రాజమహేంద్రవరం
ప్రోత్సహించడం అభినందనీయం
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ‘సాక్షి’ స్పెల్‌బీ నిర్వహించడం అభినందనీయం. ‘సాక్షి’ స్పెల్‌బీ ద్వారా ఇంగ్లిష్‌లో ఒకాబ్యులరీ, లాంగ్వేజ్ స్కిల్స్ పెంపొందుతాయి. విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
– గోడి అజయ్, విద్యార్థి తండ్రి, రాజమహేంద్రవరం
గణితంపై భయం ఉండదు..
గణితం అంటే విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ‘సాక్షి’ మ్యాథ్‌బీ దోహదపడుతుంది. ఈ పరీక్షలు పై తరగతులకు ఎంతగానో ఉపయోగపడతాయి. మ్యాథ్‌బీ గణితంపై పట్టు సాధించేందుకు దోహదం చేస్తుంది. ‘సాక్షి’ స్పెల్‌బీ ద్వారా పిల్లలు చాలా ఇంప్రూవ్ అవుతున్నారు.
– నౌషద్ బేగం, విద్యార్థిని తల్లి, రాజమహేంద్రవరం
కొత్త విషయాలు తెలుసుకున్నా..
‘సాక్షి’ స్పెల్‌బీ పరీక్ష రాయడంతో నేను కొత్త విషయాలను తెలుసుకున్నాను. స్పెల్లింగ్స్‌తో పాటు, ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సాధించేందుకు ఉపయోగపడింది. ‘సాక్షి’ యాజమాన్యం స్పెల్‌బీ పరీక్ష రాయించి విద్యార్థులను ప్రోత్సహించడం బాగుంది.
– పూర్వి మల్లెల, 6వ తరగతి,
ఆదిత్య స్కూల్, శ్రీనగర్, కాకినాడ
ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు..
ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు..
ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు..
ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు..
ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు..
ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు..
ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు..
ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు..
ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు..
ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు..


