కొబ్బరితో 106 రకాల ఉత్పత్తులు
మూడు జిల్లాల్లో 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. సగటున ఏడాదికి 126 కోట్ల కొబ్బరికాయలు ఉత్పత్తి అవుతున్నాయని అంచనా. కొబ్బరి కాయ, ఆకులు, కాండంతో కనీసం 106 ఉత్పత్తులు స్థానికంగా తయారు చేసే అవకాశముంది. కొబ్బరి చిప్స్, కోకోనట్ మిల్క్, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, కొబ్బరి క్రీమ్, కొబ్బరి విప్పింగ్ క్రీమ్, వర్జిన్ కోకోనట్ ఆయిల్, నాటా డి కోకో, కొబ్బరి వెనిగర్, కొబ్బరి బెల్లం, చక్కెర, నీరా, కొబ్బరి అమినోలు, సిరప్‌లు తయారు చేయవచ్చు. కొబ్బరి నూనెను సబ్బులు, డిటర్జెంట్లు, సౌందర్య సాధనాలు, ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు.


