జిల్లా క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా తలాటం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కాకినాడకు చెందిన తలాటం హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు కార్యదర్శి నక్క వెంకటేష్ శనివారం తెలిపారు. కాకినాడలో నిర్వహించిన సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్ఫరాజ్ నవాజ్, కోశాధికారి జి.అప్పారావు (జిమ్మీ), ఎన్ సత్యానందంలతో పాటు సభ్యులు ఏకగ్రీవంగా హరీష్‌ను ఎన్నుకున్నారు. ఈయన గతంలో తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్‌కి సేవలు అందించడంతో పాటు హరీష్ ఫౌండేషన్ పేరుతో క్రీడామైదానాల అభివృద్ధితోపాటు క్రీడాకారులకు చేయూతనిచ్చి ప్రొత్సహిస్తున్నారు.


