అనేక కార్యక్రమాలు
సత్యసాయి బాబా వారి స్ఫూర్తితో సత్యసాయి సేవా సమితుల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించే నారాయణ సేవగా అన్నదాన కార్యక్రమం ఒకటి. నిరుపేదలు, కనిపెంచిన సంతానం, ఆదరణ లేక జానెడు పొట్ట కోసం ఎంతోమంది విలవిల్లాడుతున్నారు. వారి జీవన స్థితిగతులను స్వయంగా చూశాం. వారు బయటకు రాలేరు. చేయి చాచి యాచించలేరు. అటువంటి వారి కోసం పలు సేవా సమితులు నిత్య నారాయణ సేవ అమలు చేస్తున్నాయి. ఎందరో అభాగ్యుల ఆకలి తీరుస్తున్నాయి.
– మన్యం పర్వత వర్థనరావు, జిల్లా సత్యసాయి సేవా సంస్థల వలంటరీ కన్వీనర్, రావులపాలెం


