గిరిజాతి ఆవుకు అరుదైన కవల దూడలు
మామిడికుదురు: గిరి జాతి ఆవుకు అరుదైన కవల దూడలు పుట్టిన ఘటన మామిడికుదురులో శనివారం చోటు చేసుకుంది. కుడుపూడి రామేశ్వర్, జానకి దంపతుల పొలంలో గిరి జాతికి చెందిన ఆవు మగ, ఆడ దూడలకు జన్మనిచ్చింది. ఈ దూడలు 2.8 అడుగుల ఎత్తు, 2.8 అడుగులు పొడవుతో ఆకట్టుకుంటున్నాయి. దీనిపై పశు వైద్యాధికారి చేగొండి శ్రీరామ్‌ను సంప్రదించగా ఇలా కవల దూడలు పుట్టడం అరుదైన ఘటన అన్నారు.
ఎక్కడో 100కి ఒకటి వంతున ఈ విధంగా జరుగుతుందన్నారు. గిరి జాతి ఆవు పూటకు మూడు నుంచి నాలుగు లీటర్ల పాలిస్తుందన్నారు. ఆ పాలు 4–5 వెన్న శాతం కలిగి ఉంటాయని చెప్పారు. గిరి జాతి అవు రూ.50 వేల నుంచి రూ.60 వేలు ఖరీదు ఉంటుందని చెప్పారు. స్థానికులు ఈ కవడ దూడలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.


