రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ఆరంభం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ప్రతి పాఠశాలకు క్రీడామైదానం ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై అసెంబ్లీలో చర్చిస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. శనివారం కాకినాడ జిల్లా క్రీడామైదానంలో పాఠశాల క్రీడాసమాఖ్య అండర్–14, 17 ఆధ్వర్యంలో అంతర్ జిల్లాల ఖోఖో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవానికి ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. గౌరవ అతిథులుగా కాకినాడ డివిజన్ ఉపవిద్యాశాఖ అధికారి సత్యన్నారాయణ, డీఎస్‌డీఓ బి.సతీష్‌కుమార్; ఖోఖో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జానకిరామయ్య, జిల్లా ఖోఖో సంఘ అధ్యక్షుడు పట్టాభిరాం హాజరయ్యారు. ఎస్‌జీఎఫ్‌ఐ మహిళా కార్యదర్శి సుధారాణి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్, ఖోఖో సంఘ ప్రతినిధులు వాసు, పీడీలు మాచరరావు, రాజశేఖర్, నూకరాజు, సురేష్‌రాజు, దిశ చైర్మన్ స్వరాజ్యలక్ష్మి, జేఎన్టీయూకే పీడీ శ్యాంకుమార్ పాల్గొన్నారు. 24వ తేదీ వరకు జరిగే ఈ పోటీలలో 13 జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.
13 జిల్లాల నుంచి 180 మంది హాజరు
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ఆరంభం


