మోసపోయిన మహిళ క్షేమంగా ఇంటికి
అమలాపురం రూరల్: ఉప్పలగుప్తం మండలం పెదగాడవిల్లికి చెందిన ఎం.మంగాదేవి దుబాయ్‌లో నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి ఇబ్బందులు పడుతుండగా కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ కేంద్రం క్షేమంగా ఇంటికి చేర్చినట్టు నోడల్ అధికారి కే. మాధవి, మేనేజర్ గోళ్ల రమేష్ శనివారం తెలిపారు. ఆ మహిళ 2025 11 మే దుబాయ్ వెళ్లిందని అక్కడ 3 నెలల 15 రోజులు ఒక ఇంటిలో పనికి కుదిరిందన్నారు. అక్కడ ఆ ఇంటి యజమాని చాలా ఇబ్బంది పెడుతూ ఒత్తిడి చేస్తూ ఉండేవారని విషయాన్ని ఏజెంట్ దృష్టికి తీసుకు రాగా అతను పనుల నిమిత్తం పలు ఇళ్లకు తిప్పుతూ ఇబ్బంది పెట్టాడని తెలిపారు. భోజనం పెట్టేవారు కాదని ఈ క్రమంలో ఆరోగ్యం చెడిపోయి ఇబ్బంది పడిందని చెప్పారు. మంగాదేవి కుటుంబ సభ్యులు కలెక్టర్ మహేష్‌కుమార్‌ను ఆశ్రయించగా ఆయన కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ కేంద్రాన్ని ఈ అంశం పరిశీలించమని ఆదేశించగా సిబ్బంది బాధితురాలితో, ఏజెంట్‌తో సంప్రదింపులు జరిపి ఆమెను క్షేమంగా ఇండియాకు చేర్చారు.
పెదపట్నంలంకలో
షూటింగ్ సందడి
మామిడికుదురు: ‘‘రాజి మంచి మొడుడు కావాలని దేవుడికి దండం పెట్టుకో అమ్మా’’ అంటూ కథనాయికి జయశ్రీకి తండ్రి పాత్రధారి రాజీవ్ కనకాల చెబుతున్న సీన్‌తో పెదపట్నంలంకలో శనివారం ‘రాజి’... ‘‘నో కాంప్రమైజ్’’... సినిమా షూటింగ్ ప్రారంభమైంది.


