28 నుంచి పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు
రామచంద్రపురం రూరల్: ఈ నెల 28, 29 తేదీలలో రాజమహేంద్రవరంలో నిర్వహించనున్న పీడీఎస్‌యూ 24వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్దూ పిలుపు ఇచ్చారు.
మండలంలోని ద్రాక్షారామ శ్రీనివాస శైల ఐటీఐ కళాశాల ప్రాంగణంలో వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. సిద్దూ మాట్లాడుతూ పీడీఎస్‌యూ 51 ఏళ్లుగా విద్యార్థుల హక్కుల కోసం, శాసీ్త్రయ విద్యా సమ సమాజ స్థాపన కోసం పోరాడుతోందన్నారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, మెస్ చార్జీల పెంపు, కాస్మోటిక్ చార్జీల వంటి సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తుందన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచీ విద్యార్ధులు వెల్లువలా తరలివచ్చి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలిని కోరారు. అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం, పీవైఎల్ నాయకులు వి. నాగరాజు, ఐఎఫ్టీయూ నాయకుడు చింతా రాజారెడ్డి, పీడీఎస్‌యూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


