వృద్ధుడి ఆచూకీ కోసం గాలింపు
నిడదవోలు రూరల్: పశ్చిమడెల్టా ప్రధాన కాలువలో స్నానానికి దిగి గల్లంతైన వృద్ధుడి ఆచూకీ కోసం గురువారం ముమ్మరంగా గాలిస్తున్నారు. సమిశ్రగూడెంలోని లోహియనగర్‌కు చెందిన ఉయ్యూరి వెంకటరమణ (62) ఈ నెల 19వ తేదీన గల్లంతు కాగా ఘటనపై కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. వెంకటరమణ ఆచూకీ కోసం సమిశ్రగూడెం కాల్వ గట్లు, కాకరపర్రు హెడ్‌లాక్ వద్ద ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.
బాలుడి అదృశ్యం
శంఖవరం: మండలంలోని కత్తిపూడి గ్రామానికి చెందిన బాలుడు ముద్రగడ శ్రీనివాస్ అదృశ్యమైనట్టు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. ఈ నెల 17 తేదీన సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు తిరిగి రాలేదన్నారు. బాలుడికి సుమారు 15 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాలుడు ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో తెలియపరచాలని కోరారు.


