విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి
ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్
రామచంద్రపురం: ప్రజలకు భద్రతపై భరోసా కల్పించేందుకు విజిబుల్ పోలీసింగ్ (గస్తీ)పై దృష్టి సారించాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ పోలీసులకు సూచించారు. నియోజకవర్గంలోని రామచంద్రపురం డీఎస్పీ కార్యాలయం, ద్రాక్షారామ పోలీస్ స్టేషన్, మండపేట రూరల్ సర్కిల్ కార్యాలయాల వార్షిక తనిఖీలను నిర్వహించి సిబ్బందికి ఆదేశాలను జారీ చేశారు. సబ్ డివిజన్‌లో నమోదైన కేసుల ఫైళ్లను పరిశీలించి, పెండింగ్ కేసుల స్థితిగతులు, దర్యాప్తు పురోగతి గురించి ఆరా తీశారు. దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, కఠినంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. చోరీ కేసులను త్వరితగతిన ఛేదించి, రికవరీల శాతాన్ని పెంచాలని సూచించారు. సైబర్ నేరాలపై మహిళల చట్టాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ రఘువీర్, సీఐలు వెంకటనారాయణ, పి.దొరరాజు, సురేష్, ఎస్సైలు లక్ష్మణ్, నాగేశ్వరరావు, రాము, డీ సురేష్, హరీష్‌కుమార్, కిషోర్, జానీ బాషా పాల్గొన్నారు.


