రైతులందరికీ సుఖీభవ ఇవ్వాలి
అధికారంలోకి వస్తే ఏటా రైతులకు రూ.20 వేలు చొప్పున సాయం అందిస్తామని చంద్రబాబు సహా కూటమి నాయకులు హామీ ఇచ్చారు. గత సంవత్సరం ఒక్కరంటే ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా చేతులెత్తేశారు. ఈ ఏడాది అయినా పెట్టుబడి సహాయం అందిస్తే మేలు చేకూరుతుందని రైతులంతా ఎదురుచూశారు. బయట ధాన్యం కమీషన్ ఏజెంట్లు, దళారులు, వ్యాపారస్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసే పరిస్థితి కల్పిస్తున్నారు. పెట్టుబడి సాయం ఇస్తే రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఎంతో ఆసరాగా ఉంటుందని ప్రభుత్వానికి తెలియకపోవడం విడ్డూరం. జగన్ ప్రభుత్వంలో ఏటా క్రమం తప్పకుండా విడతల వారీగా పెట్టుబడి సాయం అందించారు.
– వంగా గీత, మాజీ ఎంపీ, కాకినాడ
ఈసారైనా పెట్టుబడి సాయం అందించండి
నాకు ఎకరం 30 సెంట్ల భూమి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు పీఎం కిసాన్, రైతు భరోసా సాయం అందింది. ప్రస్తుతం ‘అన్నదాత సుఖీభవ’ డబ్బు అందడం లేదు. అదిగో... ఇదిగో... అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా నా బ్యాంకు ఖాతాలో అన్నదాత సుఖీభవ డబ్బు పడలేదు. ఈసారైనా రైతులపై దయ చూపాలి.
– చిలకమర్తి జయ హసిత, ప్రత్తిపాడు
రైతులందరికీ సుఖీభవ ఇవ్వాలి


