సాగర తీరాన రేపు మహాకుంభాభిషేకం
కాకినాడ రూరల్: మహాకుంభాభిషేకానికి కాకినాడ సాగర తీరం ముస్తాబైంది. కుంభాభిషేకం రేవు సమీపాన శ్రీ మంగళాంబిక సమేత ఆదికుంభేశ్వర స్వామి ఆలయం వద్ద 1.8 కోట్ల శివలింగాలకు, రసలింగేశ్వరునికి కార్తిక అమావాస్య రోజైన గురువారం 50వ మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదికుంభేశ్వరస్వామికి లక్ష బిల్వార్చన, శ్రీదేవి, భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామికి కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం అభిషేక జలాలను 108 మంది కన్యలతో సముద్రంలో కలపనున్నారు. దుమ్ములపేట ప్రజలు, మత్స్యకారులు, బోట్ల యజమానులు, వ్యాపారులు ఆధ్వర్యాన మధ్యాహ్నం మహాన్నదానం చేయనున్నారు. మహాకుంభాభిషేకం కరపత్రాలను యజ్ఞ కమిటీ సభ్యులు తోట పుండరీకాక్షులు, చిట్నీడి శ్రీనివాస్, బోగిరెడ్డి తాతారావు, గంగిరెడ్డి అరుణ, బూర్ల సత్యనారాయణమ్మ, నామన ప్రసన్న, సలాది శ్రీనివాసరావు తదితరులు ఆలయం ప్రాంగణంలో మంగళవారం ఆవిష్కరించారు. ఆలయం వద్ద శాశ్వతంగా 1.8 కోట్ల శివలింగాల కోసం రూ.10 లక్షల విరాళం ఇవ్వనున్నట్లు పుండరీకాక్షులు ప్రకటించారు.


