ప్రజలు గమనిస్తున్నారు
పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ, హిందుపురంలో పార్టీ కార్యాలయంపై పెద్దపెద్ద కంకరరాళ్లతో దాడులకు తెగబడటం అన్యాయమన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీ నేతలు చెప్పినట్టే కేసులు కడుతున్నారన్నారని, వాస్తవాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు. రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం నడుస్తుందా, లేక చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏమైనా అమలు చేస్తుందా అని ప్రశ్నించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుడు విప్పర్తి వేణుగోపాల్ మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌తో కాలక్షేపం చేస్తోందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిన చంద్రబాబు.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దాపురం, ప్రత్తిపాడు కో–ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అనిల్‌కుమార్(బన్నీ), రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు, అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల లోవరాజు, ప్రచారసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావూరి వెంకటేశ్వరరావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, వివిధ విభాగాల నేతలు అల్లి రాజబాబు, మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్‌కుమార్, మాజీ కార్పొరేటర్లు బోరా పెద్ద, బాదం మధు, రోకళ్ల సత్య, దుర్గాప్రసాద్, ఐ.శ్రీను, కంపర బాబీ, చిట్నీడి మూర్తి, హెచ్‌ఎంఎస్ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.


