కువైట్ నుంచి సురక్షితంగా స్వగ్రామానికి..
అమలాపురం రూరల్: కువైట్‌లో తీవ్ర ఇబ్బందులు పడిన చెయ్యేరు గ్రామ వాసి ఆర్.సత్యవతిని సురక్షితంగా స్వదేశానికి చేరారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల ఏర్పాటు చేసిన కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ తక్షణ చర్యలు తీసుకుని బాధితురాలికి సహాయం అందించింది. 2025 జూలైలో ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లిన సత్యవతి అక్కడ తీవ్ర ఆరోగ్య సమస్యలు, పని చేసే ఇంటి వద్ద మానసిక ఒత్తిడి ఎదుర్కొని అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను సంప్రదించగా కలెక్టర్ వ్యక్తిగతంగా ఈ అంశాన్ని పర్యవేక్షించి, కువైట్‌లోని సంబంధిత అధికారులతో సమన్వయం చేసి అత్యవసర సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. జిల్లా పరిపాలన సమన్వయంతో సత్యవతిని సురక్షితంగా స్వగృహానికి చేర్చారు. విదేశాలకు ఉపాధి కోసం వెళ్లదలచిన వారు తప్పనిసరిగా కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను సంప్రదించి సురక్షిత మార్గాల్లోనే వెళ్లాలని, నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని నోడల్ అధికారి కె.మాధవి సూచించారు. కార్యక్రమంలో సమన్వయకర్త గోళ్ల రమేష్, కె.సత్తిబాబు, సఫియా, దుర్గ తదితరులు పాల్గొన్నారు.
చోరీ కేసులో వ్యక్తి అరెస్ట్
చాగల్లు: చోరీ కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు కొవ్వూరు పట్టణ ఎస్సై పి.విశ్వం సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 16న కొవ్వూరు క్రిస్టియన్ పేటలో లూథరన్ చర్చి వెనుక నివాసం ఉంటున్న తుంపిరి రామారావు, తన కుటుంబ సభ్యులతో కలసి మధ్యాహ్నం బయటకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా, తలుపు తాళం పగులగొట్టి, ఇంటి లోపలి బీరువాలోని రూ.3 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైన ట్లు గుర్తించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితుడు రాజమహేంద్రవరానికి చెందిన, ప్రస్తుతం కోరుకొండ మండలం బుచ్చెంపేటలో ఉంటున్న కుందుర్తి శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి బంగారు నల్లపూసల తాడు, మూడు బంగారు ఉంగరాలు, నాలుగు జతల వెండి పట్టీలు, నాలుగు వెండి ఉంగరాలు, రెండు వెండి బ్రేస్‌లెట్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.50 లక్షలు ఉంటుందని ఎస్సై తెలిపారు. అలాగే నిందితుడిపై కొవ్వూరు పట్టణ, రాజమహేంద్రవరం త్రీ టౌన్, కడియం పోలీస్ స్టేషన్లలో ఒక్కో కేసు ఉన్నాయన్నా రు. రాజమహేంద్రవరం కేసుకు సంబంధించి బంగా రు తాడు, కడియం కేసుకు సంబంధించి రూ. 5,340 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా కేసును చేధించిన కొవ్వూరు టౌన్ ఎస్సై విశ్వం, సిబ్బందిని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అభినందించారు.
సత్రం పేరు గదుల పాత పెరగనున్న
సంఖ్య అద్దె అద్దె
హరిహరసదన్ (ఏసీ) 84 రూ.950 రూ.1,500 (జీఎస్టీతో)
హరిహరసదన్ (జనరల్) 51 రూ.600 రూ.800
ప్రకాష్‌సదన్ (ఏసీ) 64 రూ.999 రూ.1,260 (జీఎస్టీతో)
న్యూసీసీ 48 రూ.500 రూ.700
ఓల్డ్‌సీసీ 48 రూ.500 రూ.700


