రత్నగిరిపై సత్రం గదుల అద్దె పెంపు
అన్నవరం: స్థానిక వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో డిసెంబర్ ఒకటో తేదీ నుంచి వివిధ వసతి సత్రాల గదుల అద్దెలు పెంచుతూ దేవస్థానం నిర్ణయం తీసుకుంది. హరిహరసదన్ సత్రంలో గత ఏడాది, ప్రకాష్‌సదన్, న్యూ సీసీ, ఓల్డ్ సీసీ సత్రాలలో గత నెలలో సుమారు రూ.రెండు కోట్లతో మరమ్మతులు చేయించారు. కొత్త బెడ్‌షీట్స్ మార్చారు. ఈ వివరాలతో సత్రాలలో గదుల అద్దెలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ను కోరడంతో ఆయన ఆ మేరకు ఆదేశాలిచ్చినట్టు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు.
రత్నగిరిపై హరిహరసదన్ సత్రం


