కాపులను ఒకే వేదికపైకి తీసుకొస్తాం
కాకినాడ రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులను త్వరలో ఒకే వేదికపైకి తీసుకువచ్చి కొత్త సంఘం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కాకినాడలో శుభం కాపు కల్యాణ మండలంలో కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కాపు కార్తిక వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరో వచ్చి ఏదో చేస్తారని, ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురు చూడకుండా తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి సమాజంలో మంచి నడవడిక నేర్పించాలన్నారు. కాపులంటే ఇలానే ఉండాలనే విధంగా పెంచాలని సూచించారు. కాపులకు ఒక చరిత్ర ఉన్న విషయం అందరికీ తెలిసే విధంగా సంఘీయులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి సంఘం ఏర్పాటు చేసి, కాపులకు ఏ కష్టం వచ్చినా సహాయం చేసే విధంగా పని చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కాపు సద్భావన సంఘ నాయకులు గట్టి సత్యనారాయణ, దుగ్గన బాబ్జీ, చిట్నీడి శ్రీనివాస్, జనపాముల నాగబాబు, ఆకుల వెంకటరమణ, రంబాల వెంకటేశ్వరరావు, సంగిశెట్టి అశోక్, పెండెం బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
ఫ త్వరలో కొత్త సంఘం ఏర్పాటు
ఫ వన సమారాధనలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
కాపులను ఒకే వేదికపైకి తీసుకొస్తాం


