తొలి తిరుపతి..
భక్తజన పెన్నిధి
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలంలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శృంగార వల్లభ స్వామి ఆలయానికి బహుళ ఏకాదశి పర్వదినం కావడంతో శనివారం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూల నుంచీ అనేక మంది భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని, స్వామివారికి ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 22 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2,26,230, అన్నదాన విరాళాలు రూ.1,25,747, కేశఖండన ద్వారా రూ.5,280, తులాభారం ద్వారా రూ.500, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.26,685, స్వామి వారి కానుకలు రూ.221 కలిపి మొత్తం రూ.3,84,663 ఆదాయం వచ్చిందని వివరించారు. 4,500 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు.
తొలి తిరుపతి..


