భీమేశ్వరస్వామికి ఫ్రాన్స్ రాయబారి పూజలు
రామచంద్రపురం రూరల్: భారతదేశంలో ఫ్రాన్స్ అంబాసిడర్ (ఫాన్స్ రాయబారి) థాయర్ మాఽథ్యూ కుటుంబ సమేతంగా శనివారం ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామిని దర్శించుకున్నా రు. వారికి ఆలయ ఈఓ, దేవదాయశాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం భీమేశ్వరస్వామిని, మాణిక్యాంబా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. బేడా మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈఓ వారికి స్వామివారి తీర్థప్రసాదాలు, జ్ఞాపికలు అందజేశారు.


