● అమ్మ రూపం.. లక్ష గాజుల వైభవం.. | - | Sakshi
Sakshi News home page

● అమ్మ రూపం.. లక్ష గాజుల వైభవం..

Nov 15 2025 7:37 AM | Updated on Nov 15 2025 7:37 AM

● అమ్మ రూపం..  లక్ష గాజుల వైభవం..

● అమ్మ రూపం.. లక్ష గాజుల వైభవం..

కార్తిక మాసం.. శుక్రవారాన్ని పురస్కరించుకుని కాకినాడ సూర్యారావుపేటలోని బాలాత్రిపురసుందరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారిని లక్ష గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి విగ్రహంతో పాటు.. ఆ తల్లి సన్నిధానంలో రంగురంగుల గాజులను దండలు దండలుగా కూర్చారు. ఈ అలంకరణను కన్నులారా వీక్షించేందుకు భక్తులు ఉదయం నుంచీ అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. అమ్మవారికి అలంకరించిన గాజులను శనివారం ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తామని ఈఓ ఉండవల్లి వీర్రాజు తెలిపారు.

– బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement