ఫ్రెంచ్–భారత్ సాంస్కృతిక బంధం బలమైనది
● ఫ్రెంచ్ రాయబారి థేర్రీ మాథ్యూ
● ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం
● పలు చిత్రాల ప్రదర్శన
యానాం: ఫ్రాన్స్, భారత్ సాంస్కృతిక బంధాలు బదిలీ అయ్యేందుకు ఫ్రెంచి ఫిల్మ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు దోహదపడతాయని భారతదేశంలో ఫ్రెంచ్ రాయబారి థేర్రీమాత్యూ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక అంబేడ్కర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆడిటోరియంలో మూడురోజుల పాటు జరిగే ఫ్రెంచి ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు ఆర్‌ఏఓ, ఐఏఎస్ అధికారి అంకిత్‌కుమార్‌ను ఫ్రెంచి సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసారు. ఫ్రెంచి కాలం నాటి ఆర్‌సీఎం చర్చి తదితర వాటిని సందర్శించారు. యానాంలో వివిధ పాఠశాలల్లో ఫ్రెంచిభాష తరగతులు అమలు తీరుపై చర్చించారు. అనంతరం వివిధ ఫ్రెంచి చిత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆర్‌ఏఓ అంకిత్‌కుమార్, పుదుచ్చేరి ఫ్రెంచి కాన్సుల్ జనరల్ ఎటైనీ రోలాండ్ పేగ్, అలియన్స్ ఫ్రాంచైజ్ డైరెక్టర్ లారెంట్ జూలికస్, అధ్యక్షుడు సతీష్ నల్లం, నల్లం వెంకట్రామయ్య, యానాంలో ఫ్రెంచి పౌరుల ప్రతిఽనిధి సాధనాలు బాబు, చింతా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


