
700 లీటర్ల డీజిల్ పట్టివేత
తాళ్లరేవు: కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుంచి ఆంధ్రా ప్రాంతానికి ట్రాక్టర్‌లో అక్రమంగా తరలిస్తున్న 700 లీటర్ల డీజిల్‌ను పట్టుకున్నట్టు కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం రాత్రి కోరంగి పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో డీజిల్‌ను అక్రమంగా తరలిస్తున్న పాలకొల్లుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ట్రాక్టర్‌తో పాటు, 700 లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు.
ఐదుగురు జూదరుల అరెస్టు
జగ్గంపేట: జగ్గంపేట శివారు గుర్రంపాలెం రోడ్డులో పోలవరం కాలువ వద్ద పేకాట శిబిరంపై జగ్గంపేట పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ తెలిపారు.ఈ దాడిలో రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఎస్సై రఘునాథరావు, సిబ్బంది దాడులు నిర్వహించినట్టు తెలిపారు.