
ఆసనాలకు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం
అమలాపురం రూరల్: కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఈ నెల మూడో తేదీన అంతర్వేది సముద్ర తీరంలో నిర్వహించిన వృక్షాసనం, భారీ మానవహారం ఆసనాలు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించాయి. వికసిత్ భారత్‌లో భాగంగా నిర్వహించిన యోగ ఆంధ్ర మాసోత్సవాల ద్వారా అంతర్వేదిలో నిర్వహించిన వృక్షాసన భారీ మానవహారం ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించడంపై డీఆర్వో రాజకుమారి, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ డీఎల్‌డీవో రాజేశ్వరరావు, ఎస్‌డీసీ పి.కృష్ణమూర్తి, జిల్లా రవాణా అధికారి డి.శ్రీనివాసరావు, జిల్లా స్థాయి అధికారుల బృందం కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లను అభినందించారు.
ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన అంతర్వేది
వృక్షాసన భారీ మానవహారం
ఆసనాలు