
విజయవంతానికి పిలుపు
చంద్రబాబు మాయ మాటలతో మోసానికి గురైన విద్యార్థులకు, యువతకు బాసటగా నిలిచేందుకు అంతా కలిసికట్టుగా రావాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి బకాయిలు విడుదలచేసే వరకు ప్రభుత్వంపై పోరాటాలు చేయాలి. ఇందుకు యువత, విద్యార్థులు ముందు వరుసలో ఉండాలి. సోమవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న యువత పోరును విజయవంతం చేయాలి. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థి, యువజన విభాగాల అధ్యక్షులు జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోరుకు పార్టీలో యువత, విద్యార్థి విభాగాల నేతలు తరలిరావాలి. పిఠాపురం నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో పాల్గొనాలి.
– వంగా గీత. మాజీ ఎంపీ,
వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్,
పిఠాపురం
బకాయిలు
విడుదల చేసే వరకు పోరు
ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి చెల్లించే వరకు యువత, విద్యార్థులు కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో వారి పక్షాన యువజన విభాగం ఎంతవరకై నా పోరాడుతుంది. జిల్లాలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితులపై ప్రభుత్వం స్పందించాలి. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగమైనా ఇవ్వాలి, లేదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 నెలల కాలానికి నిరుద్యోగభృతి రూ.3000లు వంతున రూ.36 వేల బకాయిలతో సహా విడుదల చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం మానవతాదృక్పథంతో ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి.
– రాగిరెడ్డి అరుణ్‌కుమార్(బన్నీ)
అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం,
కాకినాడ జిల్లా

విజయవంతానికి పిలుపు