
తప్పని కటకట
అల్లవరం మండల పరిధిలోని 14 గ్రామాల్లో తాగునీటికి జనం కటకటలాడుతున్నారు. బోడసకుర్రు ఆర్‌డబ్ల్యూఎస్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో నీరు అడుగంటింది. దీని ద్వారా 53 ప్రాంతాలకు తాగునీరు అందిస్తున్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో నీరు లేకపోవడం ఎద్దడికి కారణం. పది రోజులుగా తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉన్నా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చేతులేత్తేశారు. బోడసకుర్రులో బోరు బావి నుంచి నీటిని ట్యాంకర్ల ద్వారా సంప్‌లో నింపి ఆపై ఓహెచ్‌ఆర్‌లకు పంపింగ్ చేస్తున్నారు. అది కూడా అరకొరగా మూడు లేదా నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే. బోడసకుర్రు ప్రాజెక్టులో నీటి ఎద్దడి తలెత్తడంతో బోడసకుర్రుతో పాటు, కోడూరుపాడు, గూడాల, తాడికోన, గోడి, గోడితిప్ప, గోడిలంక, ఓడలరేవు, మొగళ్ళమూరు, రెల్లుగడ్డ, అల్లవరం, ఎంట్రుకోన, బెండమూర్లంక గ్రామాల్లోని ప్రజలు ట్యాంకర్లపై ఆధార పడవలసి వస్తోంది.