
స్మార్ట్‌సిటీకి మేలు చేసే ఒప్పందం
బోట్‌క్లబ్ (కాకినాడ): ఐఐఐటీ హైదరాబాద్, కాకినాడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పరస్పర సహకారంతో పనిచేసేందుకు ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీని ద్వారా ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా, స్మార్ట్‌సిటీ అభివృద్ధికి సంబంధించిన ప్రత్యక్ష పరిశోధన, ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించనున్నారు. స్మార్ట్‌సిటీ వింగ్ ల్యాబ్ చీఫ్ టెక్నాలజీ ఆర్కిటెక్ వి అనురాధ నేతృత్వంలోని ప్రతినిధి బృందం , కై ట్ ప్రొఫెసర్లతో కలిసి వ్యూహాత్మక సహకార ప్రతిపాదనను సమర్పించడానికి బుధవారం కలెక్టర్ షణ్మోహన్‌ను కలిశారు. నగర అభివృద్ధిలో ఎదురవుతున్న ముఖ్యమైన సవాళ్లను అధిగమించడానికి ఐఐఐటీ అభివృద్ధి చేసిన వివిధ స్మార్ట్ సాంకేతికతలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు వినియోగించేందుకు ప్రతిపాదించారు. తాగునీటి పంపిణీపై రియల్ టైమ్ మానిటరింగ్, పైపులైన్ లీకేజీల గుర్తింపు, తాగునీటి నాణ్యతపై విశ్లేషణ సాగుతాయి. ఈ భాగస్వామ్యం వల్ల స్మార్ట్ సిటీలో మౌలిక సదుపాయాలను గణనీయంగా ప్రోత్సహించే వీలుంటుంది. కలెక్టర్‌ను కలిసిన వారిలో కై ట్ కళాశాల అధినేత పోతుల విశ్వం ఉన్నారు.