
కమిషనర్ల బదిలీల వివరాలిలా..
అలంపూర్: జిల్లాలోని మున్సిపాలిటీలకు కమిషనర్ల గండం వెంటాడుతుంది. ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరు ఏడాదిలోపే బదిలీపై వెళ్తున్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. గద్వాల నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ ఉండగా.. అలంపూర్ నియోజకవర్గంలో మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. గద్వాల మున్సిపాలిటీ పాతది కాగా.. అలంపూర్, వడ్డేపల్లి, అయిజకు ఆతర్వాత మున్సిపాలిటీ హోదా దక్కాయి. కొత్తగా ఏర్పడ్డ మూడు మున్సిపాలిటీల్లో కమిషనర్ల మార్పు నిత్యకృత్యంగా మారింది. ఏ కమిషనర్ ఎప్పుడు బదిలీ అవుతారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఏడాది గడవక ముందే వివిధ కారణాలతో కమిషనర్లకు స్థాన చలనం కలుగుతుంది. దీంతో మున్సిపాలిటీల్లో ఏం జరుగుతుందన్న ఆసక్తి కలుగుతోంది.
బదిలీలపై సందేహాలెన్నో..
జిల్లాలోని మున్సిపాలిటీల్లో కమిషనర్ల బదిలీలు అనేక సందేహాలకు దారితీస్తున్నాయి. రాజకీయ కారణాలతోపాటు రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి ఇమడలేక పైస్థాయి పైరవీలతో వెళ్తున్నారనే చర్చ స్థానికంగా జోరుగా సాగుతుంది. దీనికితోడు రెండు వర్గాలు, రాజకీయాలు సైతం కమిషనర్ల బదిలీలకు కారణంగా చెప్పుకొంటున్నారు. అయిజ మున్సిపాలిటీలో అత్యధికంగా 33 మంది బదిలీ కాగా అలంపూర్‌లో 14 మంది బదిలీ అయ్యారు. వడ్డేపల్లిలోనూ 11 మంది కమిషనర్లు మార్పు జరిగింది. మూడు మున్సిపాలిటీల్లో 58 మంది కమిషనర్లు బదిలీ కావడం గమనార్హం. ఇదిలాఉండగా, పురపాలికల్లో తరచూ కమిషనర్లు బదిలీ అవుతుండడంతో ఇన్‌చార్జ్‌లే అధికంగా పాలన సాగించారు. అయిజ 2012లో మున్సిపాలిటీగా మారగా.. అప్పటి నుంచి ఇన్‌చార్జ్‌ల పాలనే అధికంగా సాగింది. 33 మందిలో 18 మంది ఇన్‌చార్జ్‌లే ఉన్నారు. ఇక అలంపూర్ మున్సిపాలిటీ 2018లో ఏర్పడింది. తొలి కమిషనర్‌గా తహసీల్దార్ లక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. కానీ అదే రోజు ఎంపీడీ మల్లికార్జున్‌కు బాధ్యతలు మార్పు చేశారు. ఆయన 6 నెలల 16 రోజులు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.
కమిషనర్ మున్సిపాలిటీ బాధ్యతల బదిలీ పనిచేసిన కాలం
స్వీకరణ అయ్యింది
జి.రాజు అలంపూర్ 15.04.21 30.06.21 45 రోజులు
ఎస్.నిత్యానంద్ అలంపూర్ 30.6.21 12.10.23 2 ఏళ్ల 3 నెలలు
జి.నర్సయ్య అలంపూర్ 12.10.23 14.2.24 4 నెలలు
పి. సరస్వతి అలంపూర్ 15.2.24 28.10.24 8 నెలల 14 రోజులు
ఎస్.రాజయ్య అలంపూర్ 17.11.24 28.01.25 2 నెలల 11 రోజులు
పి.చంద్రశేఖర్‌రావు అలంపూర్ 29.1.25 23.6.25 4 నెలల 23 రోజులు
శ్రీరాములు అలంపూర్ 27.06.25
వెంకటయ్య అయిజ 9.3.19 30.4.19 50 రోజులు
టి.కృష్ణాసింగ్ అయిజ 14.11.19 20.11.19 6 రోజులు
సీహెచ్ వేణు అయిజ 21.9.20 10.11.20 49 రోజులు
ఎన్. వేణుగోపాల్ అయిజ 1.2.21 31.8.21 8 నెలలు
జీ. నర్సయ్య అయిజ 1.9.21 12.10.23 2 ఏళ్ల 2 నెలు
నిత్యానంద్ అయిజ 13.10.23 13.2.24 4 నెలలు
సీ. సత్యబాబు అయిజ 14.2.24 31.7.24 4 నెలల 15 రోజులు
సైదులు అయిజ 29.1.25 5 నెలలు
వరుణ్‌కుమార్ వడ్డేపల్లి 27.1.20 31.03.20 2 నెలల 27 రోజులు
వరుణ్‌కుమార్ వడ్డేపల్లి 1.4.21 01.521 30 రోజులు
వేణుగోపాల్ వడ్డేపల్లి 2.5.21 13.5.21 11 రోజులు
పీ.పల్లారావు వడ్డేపల్లి 14.5.21 30.11.21 6 నెలల 14 రోజులు
ఎస్.నిత్యానంద్ వడ్డేపల్లి 1.12.21 11.10.23 23 నెలల 10 రోజులు
లక్ష్మారెడ్డి వడ్డేపల్లి 11.10.23 28.10.24 వరకు 12 నెలలు
ఎస్.రాయయ్య వడ్డేపల్లి 28.10.24 8 నెలలుగా..
నత్తనడకన అభివృద్ధి పనులు
తరచూ కమిషనర్ల బదిలీలు జరుగుతుండడంతో మున్సిపాలిటీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. మున్సిపాలిటీల పాలక వర్గం పదవీకాలం ముగిసి దాదాపు 6 నెలలు పూర్తి కావస్తుంది. అధికారులపైనే మున్సిపల్ అభివృద్ధి ఆధారపడి ఉంది. కానీ మున్సిపాలిటీల నిర్వహణలో కీలక బాధ్యతలు పోషించే అధికారులు తరచు బదిలీలు అవుతున్నారు. దీంతో పురపాలికల్లో అభివృద్ధి ఎక్కడ వేసి గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. సమీకృత మార్కెట్ యార్డులు, మున్సిపల్ భవనాలు, అంతర్గత రోడ్ల నిర్మాణాలు, పట్టణ సుందరీకరణ, డివైడర్ నిర్మాణాలు.. ఇలా ఏ అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కమిషనర్ల బదిలీలు, అభివృద్ధిపై సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. స్థిరత్వం లేని అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు లేని పురపాలికపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
ఎక్కడికక్కడే నిలిచిపోతున్న
అభివృద్ధి పనులు
సమస్యలు పరిష్కారం కాక
ప్రజలకు తప్పని ఇబ్బందులు
అయిజ పురపాలికలో అత్యధికంగా 33 మంది కమిషనర్ల బదిలీ
అలంపూర్‌లో 15 మంది,
వడ్డేపల్లిలో 12 మంది
కమిషనర్ల మార్పుపై సోషల్ మీడియాలో జోరుగా ట్రోల్స్

కమిషనర్ల బదిలీల వివరాలిలా..