అలంపూర్: పెట్టుబడిదారి సమాజం తన దోపిడీని కొనసాగించడంతోనే దేశంలో అసమానతలు పెంచిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ అన్నారు. అలంపూర్‌లో సీపీఎం రెండవ రోజు రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం జరిగాయి. ముగింపు సమావేశానికి ఎండీ అబ్బాస్, రాష్ట్ర నాయకులు శ్రీరాంనాయక్ హాజరై మాట్లాడారు. సకల సమస్యలకు ప్రధాన కారణం దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక రాజకీయ సామాజిక అంతరాలే అన్నారు. ఆర్థిక, రాజకీయ సామాజిక, అంతరాలు లేని సామ్యవాద సమాజ స్థాపనతోనే సమాజంలో ఎదుర్కొంటున్న సకల సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు.
● పాలకులు సంపదను కేంద్రీకరించి ఆర్థిక అసమానతలు పెంచుతున్నారన్నారు. రాజకీయాలను వ్యాపారీకరణ చేసి రిజర్వేషన్‌లను రద్దు చేస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో రాజకీయ అవకాశలను దూరం చేస్తున్నారని, వివక్ష అంటరానితనం పెంచి సమాజంలో విభజన రాజకీయాలకు ప్రోత్సహస్తున్నారని విమర్శించారు. పేదరికం లేని సమాజ నిర్మాణం కమ్యూనిస్టులతోనే సాధ్యమన్నారు. కేంద్రం తీసుకొస్తున్న కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా జూలై 9 న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఉందని తెలిపారు. అనంతరం ఆర్. శ్రీరాంనాయక్ మాట్లాడుతూ.. సీపీఎం ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పని చేస్తోదన్నారు.
ఆర్డీఎస్‌ను ఆధునీకరించాలి..
సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి మాట్లాడుతూ.. ఆర్డీఎస్‌ను ఆధునీకరించి పూర్తి స్థాయి నీటి నిల్వలకు చర్యలు తీసుకోవాలని, మల్లమ్మకుంట, వల్లూరు రిజర్వాయర్లను నిర్మించి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వార చివరి ఆయకుట్టు వరకు సాగు నీరు అందించాలన్నారు. జూరాల ప్రాజెక్టు మరమ్మతు తక్షణమే చేపట్టి మూడు పంటలకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. అలంపూర్ చౌరస్తాలో కోట్ల వ్యయంతో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిలో తక్షణమే వైద్య సేవలు అందించాలన్నారు. 2009 వరద బాదితులకు ప్లాట్లు, ఇండ్లు ఇస్తామని ఇప్పటికి కార్యాలయాల చూట్టు తిప్పుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం నాయకులు జి. రాజు, రేవల్లె దేవదాసు, జీకే ఈదన్న, పరంజ్యోతి, మద్దిలేటి, వివి నరసింహ్మా, నరసింహ, నర్మద పాల్గొన్నారు.
జోగుళాంబ సన్నిధిలో సినీ హీరోయిన్
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ ఆలయాన్ని సినీ హిరోయిన్ సుమయ రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ పురేందర్ కుమార్ తెలిపారు. ముందుగా ఆలయ ఆధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

‘పెట్టుబడిదారి దోపిడీతో దేశంలో అసమానతలు’