
సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయా
గద్వాల: కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరినట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గద్వాల పట్టణంలో హత్యకు గురైన సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈసందర్భంగా తేజేశ్వర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జిల్లాలో ఇటీవలి కాలంలో నేరాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే పరిణమామన్నారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వ పరువు తీసేవిధంగా ఉన్నాయని, మరోసారి జరుగకుండా ఉండాలంటే నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా తీర్పులు రావాలని, అందుకోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఎంతో అవసరమన్నారు. కేటి.దొడ్డి మండలం, గద్వాలపట్టణంలో జరిగిన రెండు కేసుల్లో నిందితులను పోలీసులు త్వరితగతిన పట్టుకోవడం అభినందనీయమన్నారు. అదేవిధంగా కోర్టులో దోషులకు శిక్షపడేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కార్యక్రమంలో గడ్డంకృష్ణారెడ్డి, బండారి భాస్కర్, బాబర్, మురళి, కృష్ణ, రాజశేఖర్, వెంకటేష్; సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.