మానవపాడు: ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలోనే దేశం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని బీజేపీ రాష్ట్ర నాయకుడు బొక్క నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీజేపి మండలాధ్యక్షుడు మురళి కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు తో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాల పాలనలో అనేక చారిత్రాక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు.
ఆర్టికల్ 370 రద్దు, శ్రీరామ మందిరం, త్రిబుల్ తలాక్, ఎస్సీ వర్గీకరణ, ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి కిసాన్, ఆపరేషన్ సిందూర్, విశ్వకర్మ యోజన, మేకిన్ ఇండియా, స్వదేవీ వస్తువుల వాడకం, యూపీఐ వంటి సేవలతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో దేశాన్ని నిలిపిందన్నారు. ఎన్నో పథకాలతో కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. కార్యక్రమంలో నాయకులు జిల్లా ప్రదానకార్యదర్శి రవికుమార్, నాయకులు అక్కల రమాదేవి, స్వప్న, నాగేశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌శర్మ, లక్ష్మినారాయణ, కురుమన్న, రాఘవయ్య, తిమ్మప్ప, రామాంజి, రాజు, మదన్మోహన్, తదితరులు పాల్గొన్నారు.
‘భగవద్గీత మత గ్రంథం కాదు’
వనపర్తి రూరల్: భగవద్గీత మత గ్రంఽథం కాదని.. సర్వ మానవుల జీవితాలను ఉద్దరించే గ్రంఽథమని కేంద్ర సంగీత, నాటక అకాడమీ అవార్డు గ్రహీత, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. ఎల్‌వీ గంగాధరశాస్త్రి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వనపర్తి పట్టణ పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో భగవద్గీత విజయభేరి నిర్వహించగా.. ఆయన హాజరై భగవద్గీత శ్లోకాలు చదివి వాటి సారాంశం వివరించారు. సృష్టి ఉన్నంత వరకు ప్రపంచానికి నిదర్శనంగా నిలబడి ఉండే సనాతన ధర్మం సర్వ మానవాళి శ్రేయస్సుకు దోహదపడుతుందన్నారు. ప్రపంచంలోని ఎన్నో గ్రంథాల సారాంశం భగవద్గీతలో ఇమిడి ఉందని వివరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, పట్టణ పిరమిడ్ సొసైటీ అధ్యక్షుడు ఒమేష్‌గౌడ్, నిర్వాహకులు వెంకటస్వామి, బీచుపల్లి, పిరమిడ్ ట్రస్ట్ అధ్యక్షుడు రామకృష్ణ, మాస్టర్ పాండురంగయ్య, రుక్మానందం తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం
వనపర్తి: విద్యార్థి సంఘం ఏర్పాటు చేసి వారి సమస్యలపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్‌పార్టీ ఎన్‌ఎస్‌యూఐ విభాగాన్ని ఏర్పాటు చేసిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన హమ్ బదిలేంగే కార్యక్రమానికి ఆయనతో పాటు ఇతర నాయకులు ముఖ్యఅతిథులుగా హాజరుకాగా ఎమ్మెల్యే మేఘారెడ్డి వారికి స్వాగతం పలికారు. ముందుగా ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
యువత ఉజ్వల భవిష్యత్‌కు విభాగం నిరంతరం పని చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం విద్యార్థి సమస్యలు తలెత్తకుండా పాలన కొనసాగిస్తుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరుఫున బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించి సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు, ఇన్‌చార్జ్ రావడం సంతోషంగా ఉందని.. విద్యార్థులకు సంబంధించి ఏ సమస్యనైనా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల విజయచందర్, నాయకులు కోట్ల రవి, ఆదిత్య, ఎత్తం చరణ్‌రాజ్, మన్యంకొండ, కృష్ణబాబు, చంద్రమౌళి, వెంకటేష్, రఘుయాదవ్ పాల్గొన్నారు.

‘ప్రధాని మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి’