
నందికొట్కూరు టు అలంపూర్
అలంపూర్: అలంపూర్ క్షేత్రానికి కొత్తగా ఆర్టీసీ సేవలు ప్రారంభమయ్యాయి. గతంలో నది అవతలి వైపు ఉన్న గ్రామాల వరకే ఉన్న సేవలు ప్రస్తుతం అలంపూర్ వరకు చేరుకున్నాయి. ఏపీ రాష్ట్రంలోని నందికొట్కూరు డిపో నుంచి అలంపూర్‌కు ఆదివారం ఆర్టీసీ సేవలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి నందికొట్కూరు డిపో నుంచి అలంపూర్ మండలంలోని సుల్తానాపురం, ర్యాలంపాడు, జిల్లెలపాడు వరకు ఆర్టీసీ సేవలు కొనసాగేవి. రాష్ట్ర విభజన తర్వాత ఈ మూడు గ్రామాల రోడ్లు అధ్వానంగా మారడంతో బస్సుల రాకపోకలకు కష్టంగా మారడం నిలిపివేశారు. స్థానికుల వినతి మేరకు నందికొట్కూరు ఆర్టీసీ అధికారులు ఇన్నాళ్లకు తిరిగి సర్వీసులు ప్రారంభించారు. ఉదయం 8.30 గంటలకు నందికొట్కూరు నుంచి బస్సు ప్రారంభమై కర్నూల్ జిల్లాలోని బ్రహ్మణకొట్కూరు, కోళ్ల బావాపురం, పూడురు మన ప్రాంతంలోని ర్యాలంపాడు మీదుగా 9.50కి అలంపూర్‌కు చేరుకుంటుందని, ప్రతి రోజు నాలుగు ట్రిప్పులు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. నందికొట్కూరుకు బస్సు సేవలను అందించడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేత్రానికి బస్సు మార్గం ద్వారా చేరుకునే భక్తులు.. శ్రీశైలం వెళ్లడానికి ఈ బస్సు సర్వీస్‌లు దోహదపడతాయని హర్షం వ్యక్తం చేశారు.
ఏపీ నుంచి ఆర్టీసీ నూతన బస్సు సర్వీసు ప్రారంభం