
మత్తు పదార్థాలతో జీవితం అంధకారం
గద్వాల క్రైం: మత్తు పదార్థాలతో జీవితం అంధకారమవుతుందని, ముఖ్యంగా యువత వీటికి దూరంగా ఉండాలని రైల్వే పోలీసు అధికారి ధర్మారావు, చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది కృష్ణయ్య అన్నారు. ఆదివారం సాయంత్రం గద్వాల రైల్వే స్టేషన్ ఆవరణలో మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రయాణికులకు అవగాహన సూచించారు. చిన్న వయసులోనే అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు మత్తు పదార్థాలు, గంజాయి వంటి వాటికి దూరంగా ఉంటారన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మిన, సరఫరా చేసిన, సేవించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువతను లక్ష్యంగా చేసుకొని కొందరు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అమ్ముతూ వారిని బానిసలుగా మారుస్తు భవిష్యత్తు నాశనం చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు మంచి అలవాట్లతో ముందుకు సాగాలని సూచించారు.