
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
కేటీదొడ్డి: ఎన్నో ఏళ్లుగా పేదలు సొంతిళ్లు లేక పూరి గుడిసెల్లో నివసిస్తున్నారని, అలాంటి పేదలందరికీ ప్రభుత్వం రూ.5 లక్షలు ఖర్చు చేసి ఇందిరమ్మ ఇంటిని కట్టించి వారి కలను నిజం చేస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం కేటీదొడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, మండలానికి 378 ఇళ్లు మంజూరయ్యాయని, లబ్ధిదారులు 45 రోజుల్లో పనులు ప్రారంభించి ఏడాదిలోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5 లక్షలను విడతల వారీగా అందజేస్తున్నట్లు తెలిపారు. పార్టీ ఏదైనా అభివృద్ధి ముఖ్యమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వ హనుమంతు, జిల్లా నాయకులు గడ్డం కృష్ణరెడ్డి, జంబురామన్ గౌడు, రాజశేఖర్, రామకృష్ణనాయుడు, ఉరుకుందు, టీచర్ గోవిందు, కొండన్న, యుగందర్, రఘుకుమార్ శేట్టి, నాసీర్, తదితరులు ఉన్నారు.