
బాల్య వివాహాల అడ్డుకట్టపై ప్రత్యేక దృష్టి
మానవపాడు: బాల్యవివాహలను ముందస్తుగానే గుర్తించి, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, వీటి అడ్డుకట్టకు అందరూ సమష్టిగా కృషి చేయాలని డీడబ్ల్యూఓ సునంద సూచించారు. శనివారం మండల కేంద్రంలో ఏడు మండలాల అంగన్‌వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణిల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, 9 నెలల వరకు వివిధ దశలలో జరిగే పిండం అభివృద్ధి గురించి వివరించారు. పుట్టిన పిల్లల్లో రెండేళ్ల వరకు బ్రెయిన్ డెవలప్‌మెంట్ 75శాతం జరుగుతుందని తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లు తప్పనిసరిగా పిల్లల ఎత్తు, బరువు సరిగా కొలవాలని సూచించారు. ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు మెడికల్ కిట్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సుజాత, సూపర్‌వైజర్ ఆస్మా, లక్ష్మిదేవి, నర్గీస్, పుష్ప, జయమ్మ, బాలమ్మ, లక్ష్మి పరమేశ్వరి, పోషణ్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ సురేష్, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు న్నారు.