
ఉద్యాన పంటల పరిశీలన
ధరూరు: మండల పరిదిలోని పారుచుర్ల గ్రామ శివారులో రైతులు సాగు చేసిన ఉద్యాన పంటలను అదనపు కలెక్టర్ నర్సింగరావు పరిశీలించారు. శనివారం డ్రాగాన్ ఫ్రూట్స్ పండ్ల తోటను పరిశీలించి రైతు శారదమ్మను ప్రభుత్వం నుంచి అందిన ఫలాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తక్కువ నీటి ఖర్చుతో ఎక్కువ పంటలను సాగు చేసుకోవచ్చు అన్నారు. డ్రాగన్ ఫ్రూట్స్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, ప్రతి ఒక్క రైతు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పరికాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమయానుకూలంగా పంటకు ఎరువులు, నీళ్లు పెట్టి మంచి దిగుబడులు సాధించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాసులు, ఏపీఓ శరత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి మస్తాన్, టీఏ అలీన్ పాష, ఫీల్డ్ అసిస్టెంట్ హనుమంతు, రైతులు తదితరులు పాల్గొన్నారు.