
యోగా దినచర్యగా పాటించాలి
ఎర్రవల్లి: ప్రతి ఒక్కరికి యోగా దినచర్యగా పాటించాలని బీచుపల్లి పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజు అన్నారు. శనివారం బీచుపల్లి పదో బెటాలియన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన అధికారులు, సిబ్బందితో కలిసి యోగా ఆసనాలను వేశారు. యోగా వల్ల మనస్సుకు శాంతి కలగడమే గాక శరీర దృఢత్వం పెరుగుతుందని, ఆవేశం కలగకుండా ఓర్పును ఇచ్చే గొప్ప విద్య యోగానే అని అన్నారు. అసిస్టెంట్ కమాండెంట్‌లు నరేందర్‌రెడ్డి, శ్రీనివాసులు, పటాలం ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.