
వ్యవసాయ పనుల్లో మంచి నైపుణ్యం..
నల్లమల పొడ పశుజాతికి మన్ననూర్ గిత్తగా గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. వీటికి వ్యవసాయ పనుల్లో మంచి నైపుణ్యం ఉంటుంది. కష్టతరమైన పనులు సులువుగా చేస్తాయి. 34 ఏళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నా. ఈ ప్రాంత రైతుల నుంచి దూడలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో అమ్ముతా. వివిధ కారణాలతో పశుజాతి తగ్గడంతో వ్యాపారం కూడా తగ్గింది.
– గెంటెల హన్మంతు, పశువుల వ్యాపారి, తూర్పు పొడజాతి గోవు సంఘం అధ్యక్షుడు
రైతులను ప్రోత్సహించాలి..
నాకు 50 వరకు పశువులు ఉన్నాయి. నల్లమల రైతులకు పశుపోషణ భారంగా మారింది. పశుగ్రాసం, నీటి కొరత ప్రధాన కారణంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పశుజాతిని సంరక్షించేందుకు పునరావాస, పశుగ్రాసం పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పశువుల వల్ల అడవికి ఎలాంటి నష్టం ఉండదు. అడవిలో మేపుకొనేందుకు అనుమతి ఇవ్వాలి.
– శివాజీ గెలవయ్య, మన్ననూర్,
అమ్రాబాద్
సంతతి పెంచేందుకు కృషి..
నల్లమల పశువులకు మంచి డిమాండ్ ఉంది. తూర్పు పొడజాతి పశుసంతతి పెంచేందుకు కృషిచేస్తాం. మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదా కల్పిస్తాం. మచ్చల వైవిధ్యంపై పరిశోధన చేయించి, ఇక్కడ సంతనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఈ జాతిని సంరక్షించేందుకు ప్రభుత్వపరంగా చొరవ తీసుకుంటాం.
– వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట
●

వ్యవసాయ పనుల్లో మంచి నైపుణ్యం..

వ్యవసాయ పనుల్లో మంచి నైపుణ్యం..