
సమస్యలు పరిష్కరించాలని దీక్ష
అలంపూర్: అలంపూర్ మున్సిపాలిటీ, గ్రామీణ సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ నాయకులు శుక్రవారం ఒక్క రోజు దీక్ష చేపట్టారు. కార్యక్రమానికి బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి హాజరై దీక్షను ప్రారంభించారు. బీజేపీ నాయకులు శరత్ బాబు, గొంగళ్ల ఈశ్వర్‌తోపాటు పలువురు బీజేపీ నాయకులు దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ...రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల నిర్మాణంపై దృష్టిసారించడం లేదన్నారు. రోడ్లు అధ్వానంగా మారిన కనీస మరమ్మతులు చేపట్టడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ రహదారుల నిర్మాణాలు జరగాయన్నారు. జిల్లాలోని ఏ గ్రామ రోడ్డు చూసిన అధ్వానంగా మారిందన్నారు. అయినప్పటికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపాలిటీల్లోని అంతర్గత రోడ్లు సైతం అధ్వానం మారాయని, ప్రభుత్వం తక్షణమే 2009 వరద బాధితులకు నష్టపోయిన అలంపూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయిచి మౌళిక వసతులు కల్పించాలన్నారు. మున్సిపాలిటీలోని అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. కాశీపురం గ్రామ రోడ్డు నిర్మాణం త్వరగా చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు మధురవాణి, రాజగోపాల్, రాజశేఖర శర్మ, నాగమల్లయ్య, నాగేశ్వర రెడ్డి, అబ్దుల్లా, రంగస్వామి, నరేష్, జగన్‌మోహన్ రెడ్డి, మద్దిలేటి, ప్రదీప్ స్వామి, వినీత్, మహేష్, రమేష్ రెడ్డి, రాజశేఖర్, భాస్కర్, పరుశురాం, కృష్ణ, సత్యారెడ్డి, ప్రవీన్, అంజీ తదితరులు ఉన్నారు.