
సర్కారు బడి.. సమస్యల ఒడి
గద్వాలలో అంసపూర్తిగా మిగిలిన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల తరగతి గదుల నిర్మాణం
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలోని విద్యార్థినిల దుస్థితి.
బెంచీలపైనా, బెంచీల కింద ఇరుకిరుకుగా కూర్చొని పాఠాలు వింటున్న ఈ విద్యార్థినులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలోని పదో తరగతి వారు. ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు క్లాసులు కొనసాగుతున్నాయి. మొత్తం 20 తరగతి గదులకుగాను 14 తరగతి గదులే ఉన్నాయి. 1,152 మంది విద్యార్థినులు విద్యనసిస్తున్నారు. రెండు సెక్షన్లు తెలుగు, రెండు సెక్షన్లు ఇంగ్లీష్ మీడియానికి తరగతి గదులు అవసరం ఉన్నాయి. అయితే తరగతి గదుల కొరత కారణంగా నాలుగు సెక్షన్ల విద్యార్థులను మూడే సెక్షన్లలో సర్డుబాటు చేసి పాఠాలను బోధించాల్సి వస్తోంది. పదో తరగతిలో ఒక్కో సెక్షన్‌లో 110–120 మంది విద్యార్థి నులు అభ్యసిస్తున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ఉండటం వలన తరగతి గదులు సరిపోవడం లేదు. దీంతో ఇలా బెంచీలపైనా, కింద కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు.