
బీచుపల్లిలో మంత్రి రాజనర్సింహ పూజలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం సందర్శించారు. అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఈఓ రామన్ గౌడ్ శేష వస్త్రాలతో సత్కరించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, నాయకులు గట్టు తిమ్మప్ప, గడ్డం కృష్ణారెడ్డి, బండారి భాస్కర్ ఉన్నారు.
జోగుళాంబ సన్నిధిలో ఎస్పీ
అలంపూర్: అలంపూర్ జోగుళాంబ ఆలయాలను ఎస్పీ శ్రీనివాస్‌రావు సతీసమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి శేషవస్త్రాలతో సత్కరించారు. వీరితోపాటు సీఐ రవిబాబు, ఎస్‌ఐ శేఖర్, ఆలయ అధికారి చంద్రయ్య ఆచారి తదితరులు ఉన్నారు.
మొక్కజొన్న క్వింటాల్ రూ.2,277
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,227, కనిష్టంగా రూ.1,500 ధర పలికింది. వేరుశనగకు రూ.3,566 బకే ధర, ధాన్యం హంస రకం గరిష్టంగా రూ.1,841, కనిష్టంగా రూ.1,649, ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,119, కనిష్టంగా రూ.1,689 ధరలు లభించాయి.

బీచుపల్లిలో మంత్రి రాజనర్సింహ పూజలు