
మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి
ఇటిక్యాల: గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో పెంచుతున్న మొక్కలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశించిన లక్ష్యం మేర మొక్కలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని నర్సరీ, క్యాటిల్‌షెడ్‌ను ఆయన పరిశీలించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా నాటే మొక్కలను పెంచే నర్సరీల నిర్వహణ సక్రమంగా ఉండాలని, నర్సరీలోని మొక్కలను ఎండ నుంచి సంరక్షించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మొక్కలు ఆరోగ్యంగా పెరిగేలా నర్సరీ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం షాబాద్ గ్రామంలో రైతుల సాగు చేసిన ఆయిల్‌పామ్, బత్తాయి (నారింజ) తోటలను సందర్శించి రైతులకు తగు సూచనలు చేశారు. ఆయన వెంట శ్రీను, ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్, ఏపీఓ శివజ్యోతి, పంచాయతీ కార్యదర్శి రమేష్, టి ఎలు కృష్ణ, ప్రవీణ్, పురేందర్, ఎఫ్‌ఎ పాల్గొన్నారు.