
స్వీట్లు పంచిన ఎమ్మెల్యే విజేయుడు
బెయిల్‌పై విడుదలైన 14మంది రైతులు ఎమ్మెల్యే విజేయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు స్వీట్లు పంచారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపారని, అందుకే వారి వెనక ఉండి, వారి కోసం న్యాయ పోరాటం చేశామని ఎమ్మెల్యే అన్నారు. ఈ పోరాటంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తమతో పాటు ఉండటం చాలా గర్వంగా ఉందని అంటూ రైతులు.. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. వారివెంట కృష్ణారెడ్డి, మహిపాల్ రెడ్డి, భార్గవ్ యాదవ్, నాగేశ్వర్ రెడ్డి తదిదరులు పాల్గొన్నారు.